శ్రీ సరస్వతి దేవిగా పెద్దమ్మతల్లి అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

శ్రీ సరస్వతి దేవిగా పెద్దమ్మతల్లి అమ్మవారు

Oct 17 2026 12:28 AM | Updated on Oct 17 2026 12:28 AM

శ్రీ సరస్వతి దేవిగా పెద్దమ్మతల్లి అమ్మవారు

పాల్వంచరూరల్‌: శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు శుక్రవారం మూలనక్షత్ర స్వరూపిణి శ్రీసరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు ప్రాత కాలర్చన, శ్రీలక్ష్మీగణపతి అనుష్టాణం, వేదపారాయణం, నవగ్రహ జపాలు, శ్రీచక్రార్చన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోం సువర్ణపుష్పార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, నాదనీరాజనం, మంత్రపుష్ప పూజలు నిర్వహించారు. మూలనక్షత్రం సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. 60 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. పాల్వంచకు చెందిన భక్తులు చెరుకూరి శివపార్వతి, జయప్రకాశ్‌, లక్ష్మి పలకలు, పుస్తకాలను వితరణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement