● పాల్వంచకు చెందిన నిర్మలకు దక్కిన అశ్వారావుపేట బార్ ● కలెక్టరేట్లో లక్కీ డ్రా నిర్వహించిన అదనపు కలెక్టర్
కొత్తగూడెంఅర్బన్: అశ్వారావుపేట మున్సిపాలిటీలో 2బీ బార్షాపు లైసెన్స్ లక్కీ డ్రాలో ఓ మహిళను వరించింది. బార్ లైసెన్స్ కోసం గత నెల 5వ తేదీ నుంచి ఈనెల 12వ తేదీవరకు ఎకై ్సజ్ అధికా రులు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 357 దరఖాస్తులు అందాయి. జిల్లావ్యాప్తంగా పలువురు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు సిండికేట్గా మారి ఐదు, పది చొప్పున దరఖాస్తులు దాఖలు చేశారు. శుక్రవారం కలెక్టరేట్ హాల్లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ చేతు ల మీదుగా లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. దీంతో టోకెన్ నంబర్ 244తో పాల్వంచకు చెందిన తుపాకుల నిర్మలకు లైసెన్స్ హక్కులు దక్కాయి. అధికారులు ఆమెకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. లక్కీ డ్రా కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో కార్ల క్యూ, దరఖాస్తుదారుల రద్దీ కనిపించింది. కాగా, ఒక్కోదరఖాస్తుకు రూ.లక్ష ఫీజుఉండగా, మొత్తం దరఖాస్తుల ద్వారా రూ.3.57 కోట్ల ఆదాయం సమకూరింది. సంవత్సరానికి బార్లైసెన్స్ ఫీజు రూ.30 లక్షల వరకు ఉండగా, దరఖాస్తులతోనే అధిక ఆదాయం లభించింది. కార్యక్రమంలో ఎకై ్స జ్ సహా య కమిషనర్ ఆర్.కిషన్, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


