ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో డీఎంహెచ్‌ఓ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో డీఎంహెచ్‌ఓ తనిఖీ

Oct 17 2026 12:28 AM | Updated on Oct 17 2026 12:28 AM

చుంచుపల్లి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని భవిత, యామిని ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరి శీలించి, గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవా లని సూచించారు. రిసెప్షన్‌ వద్ద వైద్యుల పేర్లు, విద్యార్హతలు, స్పెషలైజేషన్‌, అందుబాటులో ఉండే సమయం, కన్సల్టేషన్‌ ఫీజులు, పరీక్షలు, చికిత్స ధరల పట్టికలను ప్రదర్శించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథారిటీ కమిటీ సమావేశంలో స్కానింగ్‌ సెంటర్ల రిజిస్ట్రేషన్లు, నిబంధనల అమలు, పర్యవేక్షణపై సమీక్షించారు. అన్ని స్కానింగ్‌ సెంటర్లలో మూడునెలలకోసారి తనిఖీలు నిర్వహించా లని అధికారులను ఆదేశించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపికకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టాలని సూచించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్‌ సాగరిక, డాక్టర్‌ జ్యోతి, డాక్టర్‌ ప్లోరా, డాక్టర్‌ రాకేష్‌, నాగలక్ష్మి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వర్సిటీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం కేఎస్‌ఎంలోని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ 2025–26 సంవత్సరానికి సంబంధించిన మొదటి సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను శుక్రవారం వైస్‌చాన్సలర్‌ టి.జగన్మోహన్‌రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి.టెక్‌లో (సీఎస్‌ఈ, ఈఈఈ, మైనింగ్‌, ఈసీఈ, ఐఎన్‌ఎఫ్‌)లలో 48 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, బీఎస్సీ(జియాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌)లో 52శాతం ఉత్తీర్ణత నమోదైందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్జామ్స్‌ డాక్టర్‌ ఇ.హరికృష్ణ, డీన్‌ కిషోర్‌కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫిసర్‌ అనిఫా, శ్రీనివాస్‌, మల్లేశ్వరి పాల్గొన్నారు.

శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి శుక్రవారం ఓ భక్తుడు విరాళం అందజేశారు. ఏపీలోని రాజ మండ్రికి చెందిన చెరుకూరి వెంకటేశ్వరరావు–మీనాక్షి దంపతులు రూ.లక్ష చెక్కును ఆలయ ఈఓ దామోదర్‌రావుకు అందించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామి వారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను అందజేశా రు. ఈ కార్యక్రమంలో సిబ్బంది భవాని రామకృష్ణ, వేదపండితులు పాల్గొన్నారు.

ఖమ్మం మార్కెట్‌కు

ఐదు రోజుల సెలవు

ఖమ్మంవ్యవసాయం: పండుగలు, వారాంతం నేపథ్యాన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 17న శనివారం నుంచి 21వ తేదీ బుధవారం వరకు వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈనెల 17, 18 తేదీలు శని, ఆదివారం వారాంతానికి తోడు సద్దుల బతుకమ్మ, ఆతర్వాత దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి గురువారం మార్కెట్‌ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement