నిందితులను శిక్షించాలని రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

నిందితులను శిక్షించాలని రాస్తారోకో

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

హారణి కుటుంబీకుల ఆందోళన

విచారణలో వేగం పెంచాలని ఎస్పీని ఆదేశించిన మంత్రి తుమ్మల

జూలూరుపాడు: జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం ఎస్సీకాలనీకి చెందిన బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థిని ఇంద్రవల్లి హారణి(18) అనుమానాస్పద స్థితిలో మంగళవారం సాయంత్రం మృతి చెందిన విషయం విదితమే. ఈమేరకు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జూలూరుపాడులోని పాపకొల్లు క్రాస్‌ వద్ద భద్రాచలం రహదారిపై కుటుంబసభ్యులు, బంధువులు, వివిధ పార్టీల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం హారణి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించగా అంబులెన్స్‌లో తరలిస్తున్న క్రమాన ఆందోళన జరుగుతుండటంతో ఉద్రిక్తత నెలకొంది. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ చేరుకొని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా నిందితులను శిక్షించే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. ఇంతలో మణుగూరు నుంచి వెళ్తున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన ఎస్పీ రోహిత్‌ రాజుకు ఫోన్‌లో మాట్లాడి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాక ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. వివిధ పార్టీలు, సంఘాల నాయకులు యాసా నరేష్‌, గుండెపిన్ని వెంకటేశ్వర్లు, గార్లపాటి వెంకటి, కొడెం సీతాకుమారి, కుదురుపాక నిర్మల, గుగులోత్‌ వంశీ, జార్జిరెడ్డి, సురేష్‌, అశోక్‌, బాలాజీ, తరుణ్‌, ఎస్‌.కే. చాంద్‌పాషా, చింటు పాల్గొన్నారు.

నివాళులర్పించిన ఎమ్మెల్యేలు

చుంచుపల్లి: కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో వద్ద హారణి మృతదేహం వద్ద కొత్తగూడెం, వైరా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, రాందాస్‌ నాయక్‌ నివాళులర్పించారు. ఎస్‌ఐ జీనత్‌కుమార్‌, పోలీసుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అన్ని విధాలుగా హారణి కుటుంబానికి అండగా ఉంటామని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మేయర్‌ మూడ్‌ గణేష్‌, ఉప సర్పంచ్‌ పాషా, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కే.సాబీర్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement