స్వీయ క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి.. | - | Sakshi
Sakshi News home page

స్వీయ క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి..

Feb 25 2026 9:03 AM | Updated on Feb 25 2026 9:03 AM

స్వీయ క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి..

స్వీయ క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి..

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): స్వీయ క్రమశిక్షణ అలవర్చుకుంటే విద్యార్థులు ఏ రంగంలోనైనా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని ఎస్పీ రోహిత్‌రాజ్‌ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కల్పించాలనే సంకల్పంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఎరైవ్‌ – ఎలైవ్‌’రెండో విడతలో భాగంగా మంగళవారం కొత్తగూడెం క్లబ్‌లో కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షించగా.. ఎస్పీ హాజరై మాట్లాడారు. హెల్మెట్‌ వినియోగం, సీటు బెల్ట్‌ ప్రాధాన్యత, డిఫెన్సివ్‌ డ్రైవింగ్‌పై వివరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ రూట్‌, సిగ్నల్‌ జంపింగ్‌, ఓవర్‌ లోడ్‌తో కలిగే దుష్పరిణామాలతోపాటు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ నిషేధిత గంజాయిని ఎవరైనా సరఫరా చేస్తున్నట్లు లేదా సేవిస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, వన్‌టౌన్‌, త్రీ టౌన్‌, చుంచుపల్లి సీఐలు కరుణాకర్‌, ఇంద్రసేనారెడ్డి, వెంకటేశ్వర్లు ఎస్‌ఐలు రమణారెడ్డి, ప్రవీణ్‌, రమాదేవి, విజయ, రాకేశ్‌, విజయసింహారెడ్డి, ఉమ, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఎస్పీ రోహిత్‌రాజ్‌ సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement