మట్టి.. కొల్లగొట్టి
సీతారామ ప్రధాన కాల్వ ప్రాంతం
ములకలపల్లి: సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ) ప్రధాన కాల్వ మట్టి మాయమైపోతోంది. మాధారం – పూసుగూడెం అటవీ ప్రాంతంలో కెనాల్ మట్టి అక్రమార్కుల పాలవుతోంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఆర్‌అండ్‌బీ రోడ్డు వెంట సైడ్‌బర్మ్ పేరిట నెలకు ఐదురోజులపాటు అనుమతులు పొంది, నెలంతా అడ్డూ అదుపు లేకుండా అక్రమ తోలకాలు సాగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రాత్రివేళ వేలాది ట్రిప్పుల మట్టి టిప్పర్లతో మట్టిని పాల్వంచ, కొత్తగూడెం తరలించినట్లు సమాచారం. కలెక్టర్ స్పందించి, సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


