వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Feb 25 2026 9:01 AM | Updated on Feb 25 2026 9:01 AM

వైద్య పోస్టులకు  దరఖాస్తుల ఆహ్వానం

వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

చుంచుపల్లి: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆస్పత్రుల్లో వివిధ విభాగాల నిపుణలను, ఎంబీబీఎస్‌ వైద్యులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీహెచ్‌ఎస్‌ రవిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా వైద్యులతో అశ్వారావుపేట, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, చర్ల ఆస్పత్రుల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు మార్చి 7 తేదీ సాయంత్రం 5 గంటలోపు సూపరింటెండెంట్‌, జిల్లా ఆస్పత్రుల ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

పోడు భూములకు

ట్రంచ్‌లు

పాల్వంచరూరల్‌: గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని, రక్షణగా ట్రంచ్‌ కొడుతున్నారు. మండలంలోని చిరుతానిపాడు గ్రామానికి చెందిన మడివి సురేశ్‌, మడవి అజయ్‌ పదేళ్లుగా గ్రామ సమీపంలో సుమారు నాలుగు ఎకరాలు పోడు కొట్టి వ్యవసాయం చేస్తున్నారు. మంగళవారం వైల్డ్‌లైఫ్‌ అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకుని, జేసీబీతో ట్రంచ్‌ కొట్టారు. దీంతో బాధిత రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement