డెంగీతో అంగన్‌వాడీ టీచర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

డెంగీతో అంగన్‌వాడీ టీచర్‌ మృతి

Feb 24 2026 7:16 AM | Updated on Feb 24 2026 7:16 AM

డెంగీతో అంగన్‌వాడీ టీచర్‌ మృతి

డెంగీతో అంగన్‌వాడీ టీచర్‌ మృతి

అశ్వారావుపేటరూరల్‌: జ్వరంతో చికిత్స పొందుతున్న ఓ అంగన్‌వాడీ టీచర్‌ పరిస్థితి విషమించి మృతి చెందింది. మండలంలోని బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వాగొడ్డుగూడేనికి చెందిన మడకం చెల్లమ్మ(36) స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో కొన్నేళ్లుగా టీచర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే గడిచిన వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతోంది. దీంతో కుటుంబీకులు ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. జ్వరం తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం జంగారెడ్డిగూడెం నుంచి మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలోనే సోమవారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందింది. కాగా, ప్లేట్‌లెట్స్‌ పడిపోయి, డెంగ్యూ జ్వరంతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారని మృతురాలి కుటుంబీకులు చెబుతున్నారు. మృతురాలికి భర్త సర్వేశ్వరరావు, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా ఈ ఘటనపై గుమ్మడవల్లి పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్‌ మధుళిక మాట్లాడుతూ.. మెడికల్‌ రిపోర్టులు పరిశీలించాక వివరాలు తెలుస్తాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement