అసహనం!
న్యూస్‌రీల్
పంచాయతీలకు కేంద్ర నిధులు రావడంతో హర్షాతిరేకాలు
ఆ నిధులతో పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు
పాత బిల్లుల చెల్లింపులపై
కొత్త పాలకవర్గాల అసహనం
ఆనందం..
మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఇఫ్తార్
(మంగళ వారం సాశ్రీశ్రీ)
6.19
సహర్
(బుధవారం ఉశ్రీశ్రీ)
5.08
బూర్గంపాడు: రెండేళ్లుగా గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవటంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామపంచాయతీల్లో కనీస అవసరాలకు కూడా నిధుల కటకట ఏర్పడింది. గ్రామపంచాయతీ కార్యదర్శులు అత్యవసర పనులకు అప్పులు చేసి ఖర్చు చేశారు. గత డిసెంబర్‌లో గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాగా, ఇటీవల గ్రామపంచాయతీ ఖాతాల్లో జమచేశారు. వీటిని 2024–25లలో చేసిన పనులకు బిల్లులు చెల్లించుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి గెలిచిన కొత్త పాలకవర్గాలు పాత బిల్లులు చెల్లించేందుకు అసహనంగా ఉన్నాయి.
కొత్త పాలకవర్గాల ఆశలపై నీళ్లు..
జిల్లాలోని471 గ్రామపంచాయతీలకు గాను 468 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. ఎన్నికల ముందు కోతులు తరిమివేత, రోడ్లు, డ్రెయినేజీల మరమ్మతులు, తాగునీటి సమస్యలపై హామీలు ఇచ్చారు. అధికారం చేపట్టి రెండు నెలలు గడుస్తున్నా నిధులు లేకపోవటంతో ఏ పనులూ చేపట్టలేకపోయారు. కొందరు సర్పంచ్‌లు సొంత ఖర్చులతో అత్యవసర పనులు చేపట్టారు. ఈ తరుణంలోనే కేంద్రం నిధులు విడుదల చేయడంతో కొత్త పాలకవర్గాల్లో ఆనందం వ్యక్తమైంది. పాత బిల్లులు చెల్లించేందుకు వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో కొత్త పాలకవర్గాల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పాత బిల్లులను కూడా కొత్తగా ఎన్నికై న సర్పంచ్, ఉప సర్పంచ్‌లు జాయింట్ చెక్‌పవర్‌తోనే చెల్లించాల్సి ఉంది. దీంతో పెండింగ్ బిల్లులు రావాల్సిన వారు సర్పంచ్, ఉప సర్పంచ్‌ల చుట్టూ తిరుగుతున్నారు.
అసహనం!
అసహనం!
అసహనం!


