ముత్తంగి అలంకరణలో రామయ్య | - | Sakshi
Sakshi News home page

ముత్తంగి అలంకరణలో రామయ్య

Feb 24 2026 7:14 AM | Updated on Feb 24 2026 7:14 AM

ముత్తంగి అలంకరణలో రామయ్య

ముత్తంగి అలంకరణలో రామయ్య

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళా ల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చిబేడామండపంలో కొలువుదీర్చారు. విశ్వ క్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణ ధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణా న్ని శాస్త్రోక్తంగా జరిపారు.

అమలాపురంలో రామయ్య కల్యాణం..

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఏపీలోని అమలాపురంలో భద్రాచలం శ్రీసీతారామ చం ద్రస్వామిదేవస్థానం ఉత్సవ మూర్తులకు కల్యా ణ మహోత్సవం జరపునున్నట్లు ఆలయ ఈఓ దామోదర్‌రావు తెలిపారు. ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు కిమ్స్‌ విద్యా సంస్థల ప్రాంగణంలో 3వ ప్రపంచ మహాసభలు జరుగుతున్నాయని, ఈ సందర్భంగా కల్యాణం జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

నేడు నవమి ఏర్పాట్లపై సమీక్ష

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మార్చి 27,28వ తేదీల్లో జరిగే శ్రీరామనవ మి, పట్టాభిషేకంఉత్సవాలఏర్పాట్లపై మంగళవా రం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్‌కలెక్టరేట్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి జిల్లాస్థాయి అధికారులు సకా లంలో హాజరు కావాలని వెల్లడించారు. భక్తులకు అందించే సౌకర్యాలు, వసతులపై సమగ్ర సమాచారంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా రావాలని ఆదేశించారు.

మహిళా సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం

పాల్వంచరూరల్‌: అధికంగా మాత్రలు మింగి ఓ మహిళా సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మండల పరిధిలోని ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఆదివారం రాత్రి మాత్రలు వేసుకోవడంతో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఈ విషయమై రూరల్‌ ఎస్‌ఐని వివరణ కోరగా.. సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

మిర్చి రైతులకు వర్ష భయం

కరకగూడెం: రాష్ట్రంలో వాతావరణం అకస్మాత్తుగా మార్పు చెంది వచ్చే రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఆరబోసిన మిర్చిని కుప్పగా చేర్చి పట్టాలు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. వర్షం పడితే మిర్చి నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement