అర్హత పత్రాలతో ప్రభుత్వ పథకాలు | - | Sakshi
Sakshi News home page

అర్హత పత్రాలతో ప్రభుత్వ పథకాలు

Feb 24 2026 7:14 AM | Updated on Feb 24 2026 7:14 AM

అర్హత పత్రాలతో ప్రభుత్వ పథకాలు

అర్హత పత్రాలతో ప్రభుత్వ పథకాలు

భద్రాచలం: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గిరిజనులు అన్ని అర్హత పత్రాలతో దరఖాస్తులు చేసుకోవా లని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్‌ సూచించారు. సోమవారం ఐటీడీఏ సమావేశం మందిరంలో జరిగిన గిరిజన దర్బార్‌లో ఆయన దరఖాస్తులను స్వీకరించి సంబంఽధిత యూనిట్‌ అధికారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గిరి జనుల సమస్యలను పరిష్కరించి, వారికి సత్వరమే ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల కోసం ఇల్లెందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన మోతీలాల్‌, సీతారామ ప్రాజెక్ట్‌ భూ నష్టపరిహారం కోసం పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన రమాదేవి దరఖాస్తు చేశారు. వ్యవసాయ పంపు కోసం టేకులపల్లి మండలం వాగొడ్డు గ్రామానికి చెందిన సోనా, రుణం కోసం కొణిజర్ల మండలం రామనర్సయ్య నగర్‌ గ్రామానికి చెందిన చంటి, సోలార్‌ కనెక్షన్‌ కోసం జూలూరుపాడు మండలం భూక్య తండా గ్రామానికి చెందిన కృష్ణ వినతిపత్రాలు అందించారు. కాగా దర్బార్‌లో దాదాపు 250 దరఖాస్తులు వచ్చాయని, వీటన్నింటిని ఆన్‌లైన్‌లో నమోదుచేసి పరిష్కరించాలని సూచించారు. అధికారులు డేవిడ్‌ రాజ్‌, అశోక్‌, అరుణ కుమారి, మధుకర్‌, సున్నం రాంబాబు, ఉదయ్‌ కుమార్‌, గన్యా, లక్ష్మీనారాయణ, హరిత, హేమంత్‌, నాగేశ్వరరావు, ఆదినారాయణ పాల్గొన్నారు.

తిరుకల్యాణోత్సవాలకు ఆహ్వానం

కాగా కరకగూడెం మండలం బుద్ధారం గ్రామంలో మార్చి 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే జ్వాల లక్ష్మీ నరసింహ స్వామి తిరు కల్యాణ మహోత్సవాలకు రావాలని పీవో రాహుల్‌ను ఆహ్వానించారు. అనంతరం వాల్‌ పోస్టర్లు ఆవిష్కరించారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement