స్పోర్ట్స్ మీట్‌లో పోలీసుల ప్రతిభ
కొత్తగూడెంటౌన్: హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా పోలీసులు ప్రతిభ చాటారు. 19 పతకాలు సాధించారు. వాటిలో బంగారు పతకాలు 6, రజత 6, కాంస్య పతకాలు 7 ఉన్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం ఎస్పీ రోహిత్‌రాజు తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్‌రాజు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ క్రీడల్లో ప్రతిభ చాటడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
టెన్నిస్‌లో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, పాల్వంచ సీఐ కే.సతీష్, ఆర్‌ఐ కృష్ణారావు రజత పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభా గంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ రజత పత కం, త్రీటౌన్ కానిస్టేబుల్ రత్నకుమారి బాక్సింగ్, ట్రెడిషనల్ యోగా, జిమ్నాస్టిక్స్ విభాగాల్లో నాలు గు పతకాలు, ఏఆర్ కానిస్టేబుల్ ప్రవీణ్ బ్యాడ్మింటన్‌లో రెండు రజత పతకాలు, ఏఆర్ కానిస్టేబుల్ డి.సుష్మ పరుగు పందెంలో రెండు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. అశ్వాపురం కానిస్టేబుల్ నాగ స్వరూప బ్యాడ్మింటన్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో బంగారు పతకం, విమెన్స్ డబుల్స్‌లో కాంస్య పతకాలుసాధించారు.
విజేతలకు ఎస్పీ రోహిత్‌రాజు అభినందన


