విలువిద్యలో విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

విలువిద్యలో విద్యార్థుల ప్రతిభ

Feb 23 2026 7:08 AM | Updated on Feb 23 2026 7:08 AM

విలువిద్యలో  విద్యార్థుల ప్రతిభ

విలువిద్యలో విద్యార్థుల ప్రతిభ

భద్రాచలం టౌన్‌: ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌ (ఫేస్‌–2) విలువిద్య పోటీల్లో భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ పురుషుల జట్టు తరఫున ఆడిన కళాశాల విద్యార్థులు ఇర్పా ఆనంద్‌, కొమరం అశ్విత్‌ దొర జట్టు ఎలిమినేషన్‌ రౌండ్‌లో 4వ స్థానం కై వసం చేసుకున్నారని ప్రిన్సిపాల్‌ జాన్‌ మిల్టన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో జరిగే ఫేస్‌–1 క్రీడలకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, కోచ్‌ కళ్యాణ్‌ను ప్రిన్సిపాల్‌తోపాటు పీడీ డాక్టర్‌ ఎం. కిరణ్‌ కుమార్‌ అభినందించారు.

నేడు గిరిజన దర్బార్‌

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్‌ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్‌ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పీఓ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement