నాటక రంగానికి పూర్వవైభవం తేవాలి
భద్రాచలంటౌన్: సమాజానికి దిశానిర్దేశం చేసే నాటక రంగానికి పూర్వ వైభవం తేవాలని ప్రముఖ సినీ నటుడు గౌతమ్ రాజు అన్నారు. రెండు రోజులుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర నాటకోత్సవాలు ఆదివారం రాత్రి ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నాటక రంగాన్ని బతికించు కోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కాగా చివరి రోజు ప్రదర్శించిన నాటకాలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. మిమిక్రీ రమేష్ ప్రదర్శించిన షో నవ్వుల పువ్వులు పూయించింది. సినీ నటులు గౌతమ్‌రాజు, తనూజతో పాటు సినీ నిర్మాత, దర్శకుడు విజయ్ వర్మను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
సినీ నటుడు గౌతమ్ రాజు


