రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
పాల్వంచ: రాష్ట్రస్థాయి సీఎం కప్–2026 వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు 14 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఆదివారం స్థానిక శ్రీనివాసకాలనీలోని మినీ స్టేడియంలో జిల్లాస్థాయి సీఎం కప్–2026 వెయిట్ లిఫ్టింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు సుమారు 30 మంది క్రీడాకారులు హాజరు కాగా అందులో 14 మంది ఎంపికయ్యారు. ఎంపికై న వారిని డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి అభినందించారు. వై.వెంకటేశ్వర్లు, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి
పోటీల్లో ప్రతిభ
భద్రాచలంటౌన్: హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ సెకండ్ ఎడిషన్ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు రజత పతకాలు సాధించినట్లు జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీవీ రామిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 57 కేజీల విభాగంలో బట్టు శ్వేత, 76 కేజీల విభాగంలో కంబాల అక్షిత అద్భుత ప్రదర్శన కనబరిచి రెండోస్థానంలో నిలిచారు. వారిని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.మల్లేశ్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు భోగాల శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణప్రసాద్, కోశాధికారి వెంకటకృష్ణాజీ, జాయింట్ సెక్రటరీ శోభన్‌నాయక్ తదితరులు అభినందించారు.
పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్ పైనుంచి జలాశయాన్ని వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 397 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్‌కు రూ.20,995 ఆదాయం లభించింది. 170 మంది బోటింగ్ చేయడం ద్వారా రూ.10,610 ఆదాయం టూరిజం శాఖకు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
‘జూపల్లి’ వైద్యశాల ప్రారంభం
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి ప్రాంతంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గుండె వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని హైదరాబాద్ కిమ్స్ గ్రూప్ ఆఫ్ వైద్యశాలల చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని జూపల్లి వీధిలో జూపల్లి రామచంద్రరావు ఐ అండ్ కార్డియాక్ (గుండె) ఆస్పత్రిని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. డాక్టర్ బి.స్నిగ్ధ, జూపల్లి వెంగళరావు.. సత్తుపల్లి ప్రాంతంలో జపాన్ టెక్నాలజీతో క్యాత్‌ల్యాబ్ మిషన్‌తో స్టంట్స్, పేస్‌మేకర్, యాంజియోగ్రామ్ వంటి వై ద్యసేవలు తొలిసారిగా ప్రవేశపెట్టారని చెప్పా రు. వివేకానందన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక


