యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడిటేషన్‌ కమిటీలు | - | Sakshi
Sakshi News home page

యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడిటేషన్‌ కమిటీలు

Feb 23 2026 7:08 AM | Updated on Feb 23 2026 7:08 AM

యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడిటేషన్‌ కమిటీలు

యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడిటేషన్‌ కమిటీలు

ఖమ్మంసహకారనగర్‌: జర్నలిస్టు యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడిటేషన్‌ కమిటీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్‌, వెబ్‌సైట్‌ సమస్యలు, కేబుల్‌ చానళ్లు, చిన్న పత్రికల అంశాలపై టీయూడబ్ల్యూజే – ఐజేయూ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామ్‌నారాయణ సారథ్యంలో కలిసి వినతిపత్రం సమర్పించింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారం చూస్తే 50 శాతం కార్డులు కూడా రాకపోవచ్చనే గందరగోళం జర్నలిస్టుల్లో నెలకొందని, ఫ్రీలాన్సర్‌, వెటరన్‌ జర్నలిస్టులకు పెట్టిన నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయని, అక్రిడిటేషన్‌ వెబ్‌సైట్‌ ఫార్మాట్‌ సులభతరం కాకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అక్రిడిటేషన్‌ గడువును మరో నెల పొడిగిస్తామని, అర్హులైన అందరికీ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం బాధ్యులు మాటేటి వేణుగోపాల్‌, వనం వెంకటేశ్వర్లు, మైస పాపారావు, మామిడాల భూపాల్‌, కనకం సైదులు, మోయినుద్దీన్‌, నాగండ్ల శివ, చెరుకుపల్లి శ్రీనివాస్‌, నంచర్ల జనార్దనాచారి, వేగినాటి మాధవరావు, ఏలూరు వేణుగోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement