సీఎం కప్ పోటీల్లో సత్తా..
అశ్వారావుపేటరూరల్: రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో గిరిజన మహిళ సత్తా చాటింది. మండలంలోని గుంటిమడుగు గ్రామానికి చెందిన గిరిజన మహిళ బంధం విజయకుమారి హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ 2వ ఎడిషన్ రాష్ట్రస్థాయి పోటీల్లో భాగంగా సీనియర్ షాట్‌పుట్‌లో ప్రతిభ కనబరిచి, కాంస్య పతకం సాధించింది. గ్రామస్తులు, స్నేహితులు విజయకుమారిని అభినందించారు.
ఆర్చరీ ఖేలోఇండియా ఫేస్–1కు అర్హత
ఖమ్మంస్పోర్ట్స్: జాతీయస్థాయి గిరిజన ఖేలో ఇండియా ఆర్చరీ పోటీల్లో జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఫేస్–1కు అర్హత సాధించారు. న్యూ ఢిల్లీలో జరిగిన జాతీయ గిరిజన ఆర్చరీ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొన్న కె.అశ్విత్‌దొర, ఈ.ఆనంద్, కె.లక్ష్మణ్ రికర్వు ఈవెంట్‌లో జాతీయస్థాయిలో నాలుగోస్థానంలో నిలిచి ఫేస్–2 నుంచి ఫేస్–1 కు అర్హత సాధించారు. వీరు త్వరలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగే ఫేస్–1 జాతీయస్థాయి గిరిజన ఆర్చరీ పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వ హించనున్నారు. క్రీడాకారులు ఎంపిక కావడంపై జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు సాధుల సారంగపాణి, కార్యదర్శి పుట్టా శంకరయ్య, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి అభినందనలు తెలిపారు.


