15 వేల మొక్కలు నాటిన రోటరీక్లబ్ బాధ్యులు
బూర్గంపాడు: మండలంలోని తాళ్లగొమ్మూరు గ్రామంలో పర్యావరణ పరిరక్షణ నిమిత్తం సారపాక రోటరీక్లబ్ బాధ్యులు శనివారం 15,000 మొక్కలను నాటారు. కార్యక్రమానికి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ హాజరై మొక్కలు నాటి, మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలు మనకు స్వచ్ఛమైన గాలి అందించడంతో పాటు జీవవైవిధ్యాన్ని కాపాడతాయని తెలిపారు. రోటేరియన్ శైలేంద్రసింగ్, రాంబాబు, చాంద్‌బాషా, శ్యాంకిరణ్, భాస్కర్, ప్రఫుల్ల కుమార్, చంగల్‌రావు, బసప్ప రమేశ్, రాజశేఖర్, సత్యనారాయణ, మురళీధర్, తిరుపతిరావు, మహేష్, విద్యా వాణి, మల్లికార్జున్, సౌమ్య పాల్గొన్నారు.


