రైళ్లలో అగ్ని ప్రమాదాల నియంత్రణకు చర్యలు
కొత్తగూడెంఅర్బన్: రైళ్లలో అగ్ని ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ సాయి తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా డ్రైవ్‌లో భాగంగా ఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌లో పార్శిల్ ఆఫీస్, స్టేషన్ ఆవరణలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం అగ్నిమాపక యంత్రాల వాడకం, రైళ్లలో ఏ వస్తువులను తీసుకెళ్లడం నిషేధించారో ప్రమాణికులకు వివరించారు. ఉద్యోగులు, ప్రయాణికుల అప్రమత్తతను పెంచడం డ్రైవ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు జేమ్స్‌పాల్, ఆర్‌పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు క్రీడల్లో ప్రతిభ
చుంచుపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన 4వ తెలంగాణ పోలీస్ క్రీడా పోటీల్లో భాగంగా టీజీఎస్పీ రేంజ్–1 నుంచి 6వ పటాలం భద్రాద్రి కొత్తగూడెంనకు చెందిన పోలీస్ క్రీడాకారులు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు అందుకున్నారు. పీసీ–894 టి.ప్రణీత్ కరాటే విభాగంలో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించారు. పీసీ–881 కె.నవీన్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. ఆర్‌ఎస్‌ఐ కె.క్రాంతి కుమార్ ఆర్చరీ విభాగంలో రజత పతకం సాధించారు. హెచ్‌సీ–439 పి.వెంకటవరప్రసాద్, పీసీ–734 యం.భరత్‌చంద్ర, పీసీ–917 యన్.రాకేశ్ బాస్కెట్‌బాల్ విభాగంలో రజత పతకాలు సాధించారు, పీసీ–795 జి.కల్యాణ్ హ్యాండ్ బాల్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. విజేతలను తెలంగాణ స్పెషల్ పోలీస్ ఏడీజీపీ సంజయ్‌కుమార్‌జైన్, కమాండెంట్ డి.శివప్రసాద్‌రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు డి.శ్రీవాసరావు, హెచ్.అబ్దుల్‌రషీద్, కె.శంకర్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, 6వ పటాలం సిబ్బంది అభినందించారు.
బీజేపీ విధానాలను తిప్పికొట్టండి..
రుద్రంపూర్: సామాజ్రవాదానికి కొమ్ము కాస్తున్న బీజేపీ విధానాలను తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. శనివారం మంచికంటిభవన్‌లో రెడ్ బుక్ డే కార్యక్రమం పార్టీ నాయకుడు అన్నవరకు కనకయ్య అధ్యక్షతన నిర్వహించగా.. ఆయన మాట్లాడారు. 178 ఏళ్ల క్రితం కారల్ మార్క్స్ రాసిన కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికకు నిదర్శనం ఏటా ఫిబ్రవరి 21న రెడ్ బుక్ డేగా జరుపుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేశ్, కొక్కర పుల్లయ్య, ఎంబీ నర్సారెడ్డి, అన్నవరపు సత్యనారాయణ, కారం పుల్లయ్య, బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్, కొండపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీలో జిల్లావాసులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీలో జిల్లా నుంచి ఆరుగురికి స్థానం దక్కింది. రాష్ట్ర సమితి సభ్యులుగా జిల్లాకు చెందిన వరక అజిత్, ఎస్‌కే షాహిద్, గండాల సుజన్, ఇనంపల్లి సాయి, మాణిక్యాల వినయ్, గగులోతు వంశీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర నాలుగో మహాసభలు నిజామాబాద్‌లో జరిగాయి. శనివారం రాష్ట్ర కమిటీకి ఎన్నికై నవారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడం కోసం కృషి చేస్తామని, మతోన్మాద భావజాలాన్ని విద్యాసంస్థల్లో అరికట్టేందుకు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు.
పురుగుల మందు తాగి ఆత్మహత్య
తిరుమలాయపాలెం: మండలంలోని చంద్రుతండా పరిధి లకావత్‌తండాకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా శనివారం కేసు నమోదైంది. తండాకు చెందిన లకావత్ రవి(45) మద్యానికి బానిస కావడంతో పాటు కడుపునొప్పి రావడంతో శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబీకులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య విజయ, ముగ్గురు పిల్లలు ఉండగా కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
రైళ్లలో అగ్ని ప్రమాదాల నియంత్రణకు చర్యలు
రైళ్లలో అగ్ని ప్రమాదాల నియంత్రణకు చర్యలు


