పశువుల పట్టివేత..
అశ్వాపురం: ఎలాంటి అనుమతి లేకుండా బొలేరో వాహనంలో తరలిస్తున్న పశువులను మండల కేంద్రంలో శనివారం పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన అజ్మత్ అలీ, మహమ్మద్ అక్బర్, కొత్తగూడెంనకు చెందిన మహమ్మద్ మషాద్ మహేంద్ర బొలేరో వాహనంలో మణుగూరు నుంచి హైదరాబాద్ వైపు 12 పశువులను తరలిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకుని, వాహనంలోని పశువులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పశువులను పాల్వంచ గోశాలకు తరలించినట్టు సీఐ అశోక్‌రెడ్డి వెల్లడించారు.
పంట బోరు దహనం
గుండాల: పాత కక్షలతో పంట బోరుకు నిప్పంటించిన ఘటన మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని చెట్టుపల్లికి చెందిన ఇర్ప బుచ్చయ్య (ఉప సర్పంచ్) తన వ్యవసాయ భూమిలో ఇటీవల బోరు వేశాడు. శుక్రవారం రాత్రి కొందరు పొలంలో ఉన్న బోరు, స్టాటర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటిచారు. శనివారం పొలం వద్దకు వెళ్లగా బోరు పూర్తిగా కాలిపోయిందని బోరున విలపించాడు. తనపై వ్యక్తిగత కక్షలతోనే బోరును దహనం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. కొందరిపై అనుమానం ఉన్నట్లు కొమరారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
పశువుల పట్టివేత..


