స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం | - | Sakshi
Sakshi News home page

స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం

Feb 21 2026 7:14 AM | Updated on Feb 21 2026 7:14 AM

స్వర్

స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలతో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజ లు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు.విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రో క్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం

శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం సన్నిధి లో జరిగే శాశ్వత నిత్యాన్నదానానికి ఏపీకి చెందిన భక్తులు శుక్రవారం విరాళం అందజేశారు. విశాఖపట్నంకు చెందిన భక్తురాలు కె.అపురూప రూ.1,11,116ను ఆలయ పర్యవేక్షకుడు సాయిబాబుకు అందజేయగా, ఆయన దాతలకు రశీదు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దాత ల కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లికి

పంచామృతాభిషేకం

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవా రం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచా మృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరంఆలయంలోని మూల విరాట్‌కు పంచామృతంతో అభిషేకపూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతి హో మం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్‌ బాలినేని నాగేశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు.

అంతర్రాష్ట్ర

నాటకోత్సవాలు ప్రారంభం

భద్రాచలం టౌన్‌: భద్రాచలంలో అంతర్రాష్ట్ర నాటకోత్సవాలు, సాంస్కృతిక సంబరాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యా యి. ఎమ్మెల్యే డాక్టర్‌ తెల్లం వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతరించిపోతున్న నాటక రంగాన్ని బతికించేందుకు భద్రాద్రి కళాభారతి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తొలిరోజు హైదరాబాద్‌కు చెందిన గో వాడ క్రియేషన్స్‌ వారు ప్రదర్శించిన ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. అంతకుముందు చిన్నారుల నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో సీఐ నాగరాజు, పాకాల దుర్గాప్రసాద్‌, తాళ్లూరి పంచాక్షరయ్య, సబ్‌జైలర్‌ ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం1
1/3

స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం

స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం2
2/3

స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం

స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం3
3/3

స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement