ఐటీడీఏ నుంచి సహకారం అందిస్తాం
కొత్తగూడెంఅర్బన్: నిరుద్యోగులు పోటీ పరీక్షలు సిద్ధమయ్యేందుకు కావాల్సిన పుస్తకాలు, మెటీరియల్ అందించేందుకు, ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణకు ఐటీడీఏ నుంచి తప్పనిసరిగా సహకారం అందిస్తామని ఐటీడీఏ పీఓ బి రాహుల్ భరోసా ఇచ్చా రు. శుక్రవారం కొత్తగూడెంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు పలు సూచనలు చేశారు. చండ్రుగొండ, టేకులపల్లి, దమ్మపేట మండలాల్లో గ్రంథాలయాలు నిర్మిస్తామని తెలిపారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ మధుకర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
లక్ష్యంతో చదవాలి
భద్రాచలం టౌన్: గిరిజన విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ సూచించారు. శుక్రవారం నిర్వహించిన గిరిజన గురుకుల పాఠశాల వార్షికోత్సవం, పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గురుకులాల ఆర్సీ బి.అరుణకుమారి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సర్పంచ్ పూనెం కృష్ణ, ప్రిన్సిపాల్ హేమావతి తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో, ఢిల్లీలో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో జిల్లాకు ఏ వెంకటప్రసాద్, కె.నవీన్ 100 సత్తా చాటి ఖేలో ఇండియా జాతీయ చాంపియన్ షిప్‌నకు ఎంపికయ్యారు. శుక్రవారం కొత్తగూడెంలో పీఓను జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కోచ్ పి.కాశీ హుస్సేన్, క్రీడాకారులు కలవగా అభినందించి మాట్లాడారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు నాగ సీతారాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధి ఇ.మొగిలి, సుదర్శన్ పాల్గొన్నారు.
పీఓ రాహుల్


