●నిత్యం ట్రాఫిక్ సమస్యలు..
మణుగూరు రూరల్: ఇసుక లారీల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. గుట్టమల్లారం వద్ద ప్రధాన రహదారిపై వాహనదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. లారీలను రోడ్డు పక్కనే పార్కింగ్ చేయడంతో ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలు ఉండటంలేదు. వివిధ పనులపై వెళ్లే ఉద్యోగులు, ప్రజలు, రోగులు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతున్నారు. లారీల రాకపోకలతో ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళి గ్రామాన్ని కమ్మేస్తోందని, ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీనిపై మణుగూరు ఎఫ్‌ఆర్‌ఓ ఉపేందర్‌ను వివరణ కోరగా.. దుమ్ము, ధూళి నివారణకు చర్యలు చేపట్టామని తెలిపారు.
●నిత్యం ట్రాఫిక్ సమస్యలు..


