ర్యాంపులు నిల్.. అక్రమాలు ఫుల్!
చర్యలు తీసుకుంటాం
● అనుమతి లేకుండా అర్ధరాత్రి ఇసుక రవాణా ● కిన్నెరసాని, మొర్రేడు వాగుల నుంచి తరలింపు ● నాగారం, భోజ్యాతండా చెక్‌డ్యామ్‌లు కేంద్రాలుగా.. ● పట్టించుకోని రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు
పాల్వంచరూరల్: నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి వేళల్లో ఇసుక తరలిస్తున్నారు. అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అయినా పోలీస్, రెవెన్యూ అధికారుల్లో చలనం ఉండటంలేదు. ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేయకపోవడంతో అక్రమార్కులకు కలిసివస్తోంది. పాల్వంచ మండలంలోని మొర్రేడు వాగు, కిన్నెరసాని వాగుల నుంచి కొద్దిరోజులుగా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. భోజ్యాతండా సమీపంలోని మొర్రేడు వాగు, నాగారం సమీపంలోని కిన్నెరసాని నుంచి రాత్రి సమయంలో జేసీబీలతో ఇసుక తోడుతున్నారు. లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలించుకుపోతున్నారు. చెక్‌డ్యామ్‌ల పనుల పేరుతో ఇసుక దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చెక్ డ్యామ్‌ల నిర్మాణ పనులు నడవకున్నా జేసీబీలను వాగుల వద్ద ఉంచి రాత్రి వేళ్లలో భోజ్యాతండా, నాగారం శివారు ప్రాంతాల నుంచి ఇసుక తరలిస్తున్నారు.
ర్యాంప్‌ల ఏర్పాటేది..?
ప్రభుత్వం నాగారం, రంగాపురంలో ర్యాంపులు ఏర్పాటు చేయలేదు. దీంతో అక్రమార్కులు ఇసుక విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. ర్యాంపులు ఏర్పాటు చేస్తే ‘మన ఇసుక మన వాహనం’ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
కిన్నెరసాని, మొర్రెడు వాగుల్లో నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. భోజ్యతండా వద్ద నుంచి భారీ వాహనాల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు మాకు సమాచారం లేదు. ఇక నుంచి నిఘాపెట్టి చర్యలు తీసుకుంటాం. స్థానికులు సహకరించకపోవడంతో రంగాపురం వద్ద కిన్నెరసాని వాగులో ర్యాంప్ ఏర్పాటు చేయలేదు. నాగారం వద్ద ఇసుక ర్యాంప్‌కు అనువుగాలేని కారణంగా ఏర్పాటు చేయలేదు. –దారా ప్రసాద్, తహసీల్దార్, పాల్వంచ
ర్యాంపులు నిల్.. అక్రమాలు ఫుల్!


