గణితం ఆధునిక సాంకేతికతకు మూలం
పాల్వంచరూరల్: మారుతున్న కాలంలో గణిత శాస్త్రం ఆధునిక సాంకేతిక అభివృద్ధికి మూలస్తంభమని నేషనల్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గణితశాస్త్రం ప్రొఫెసర్ డి.శ్రీనివాసరావు అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఉన్న ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా ‘ఇంజనీరింగ్ సాంకేతిక రంగాలకోసం అన్వయ గణితం, గణనాత్మక పద్ధతుల్లో తాజా ధోరణులు’అనే అంశంపై నిర్వహిస్తున్న జాతీయస్థాయి సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగాఆయన మా ట్లాడుతూ విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రో త్సహించాలన్నారు. అనంతరంప్రొఫెసర్‌ను, కళా శాల ప్రిన్సిపాల్ పద్మను సత్కరించారు. పి.శ్రీనివాసరావు,ప్రొఫెసర్ సీహెచ్.రామిరెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన టాటా మ్యాజిక్
గుండాల: గుండాల నుంచి ఇల్లెందు వెళ్తున్న ఒక టాటా మ్యాజిక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలిలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్రహీంపట్నంకు చెందిన ఒక టాటా మ్యాజిక్ పసరా నుంచి ఇల్లెందు వెళ్తుండగా కాచనపల్లి గుండాల మధ్య క్రాస్ రోడ్ వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో డ్రైవర్కు స్వల్ప గాయాలతో బయటపడగా.. కరెంట్‌కు అంతరాయం ఏర్పడింది.
ఆన్‌లైన్ లింక్‌లతో
రూ.26లక్షలు స్వాహా
దమ్మపేట: మోసపూరిత ఆన్‌లైన్ లింక్‌లు క్లిక్ చేసి నగదు నష్టపోయిన ఘటనపై శుక్రవారం పోలీసులు సైబర్ కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ సాయికిషోర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని పాతచీపురుగూడెం, కొత్తూరు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే ఒకటికి పది రెట్లు అదనంగా డబ్బులు వస్తాయని వచ్చిన సందేశాన్ని నమ్మి గత నెల రోజుల క్రితం దశలవారీగా లింక్‌లను క్లిక్ చేశారు. ఈనేపథ్యాన పాతచీపురుగూడెంకు చెందిన వ్యక్తి రూ.3లక్షలు, కొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద రూ.23లక్షలను పెట్టుబడిగా పెట్టారు. ఆతర్వాత వారి వద్ద నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత వ్యక్తులు దమ్మపేట స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ తెలిపారు.
పాల్వంచరూరల్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. పాల్వంచ మండలం పాతసూరారం గ్రామానికి చెందిన నిరుపేద రైతు జక్కుల రమేష్ కుమారుడు ప్రవీణ్ బీటెక్ పూర్తి చేసి ఇంటివద్ద నుంచి ఉద్యోగ అన్వేషణలో ఉంటున్నారు. ఈక్రమాన తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని ప్రవీణ్ తండ్రి కరీంనగర్‌కు చెందిన హైదారాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉంటున్న దొడ్డి అనిల్‌కుమార్‌తో పరిచయం చేసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని, అందుకు రూ.5లక్షలు ఖర్చవుతుందని నమ్మించడంతో తండ్రి ఒకసారి ఫోన్‌పే ద్వారా రూ.2.49 లక్షలు, మరోసారి 2.51లక్షల నగదు ఇచ్చాడు. ఆ తర్వాత ఏడాది గడిచినా ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశాడని శుక్రవారం రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
బాల్యవివాహంపై కేసు
పాల్వంచరూరల్: బాల్య వివాహం జరిగిన ఐదు నెలల తర్వాత ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పెద్దమ్మగుడి వద్ద ఇల్లెందు పట్టణానికి చెందిన 17 ఏళ్ల బాలికతో పాల్వంచ మండలం దేవోజ్యాతండాకు చెందిన వ్యక్తితో గతేడాది ఆగస్టు 17 తేదీన వివాహమైంది. ఇది జరిగిన ఐదు నెలల తర్వాత అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సుధాతిదేవి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మైనర్ బాలిక తండ్రి, పిన్ని, వరడు తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
సాగర్ కాల్వలో
వృద్ధుడి మృతదేహం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం గోపాలపురం ప్రాంతానికి చెందిన షేక్ నాగుల్ మీరా(65) మృతదేహాన్ని టేకులపల్లి సమీపాన సాగర్ ప్రధాన కాల్వలో శుక్రవారం గుర్తించారు. ఆయన అదృశ్యమైనట్లు కుటుంబీకుల ఫిర్యాదుతో గురువారం ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈమేరకు పోలీసులు ఆరా తీస్తుండగానే సాగర్ కాల్వలో మృతదేహం తేలుతుందనే సమాచారం అందింది. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది, అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మృతదేహాన్ని బయటకు తీయించగా నాగుల్‌మీరాదేనని కుటుంబీకులు గుర్తించారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


