సింగరేణి క్వార్టర్‌లో చోరీ..
ఇల్లెందు: పట్టణంలోని జేకే సింగరేణి కాలనీలోని క్వార్టర్‌లో చోరీ సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం జేకే ఏరియాలోని ఎస్‌డీ –48 క్వార్టర్‌లో కేఓసీలో జనరల్ మజ్ధూర్‌గా విధులు నిర్వహిస్తున్న షబ్బీర్ రెండు రోజులు బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి తన ఇంటికి రాగా తలుపులు పగులకొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలోని ఆరు తులాల వెండి, రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ సంఘటనపై షబ్బీర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అక్కడకు చేరుకుని ఆధారాలు సేకరించారు.
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
భద్రాచలంటౌన్: కుటుంబకలహాల నేపథ్యాన ఓ వ్యక్తి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాచలంలోని జగదీష్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచిలకకు చెందిన గుండమ్మల రమేష్(34) పట్టణంలో అద్దెకు ఉంటున్నాడు. ఈక్రమంలో గత కొంతకాలంగా భార్య సుమలతతో ఏర్పడిన గొడవల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన రమేష్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


