సవాళ్ల స్వాగతం!
న్యూస్‌రీల్
కొత్తగూడెంలోని 60 డివిజన్లలోనూ పైప్‌లైన్ల లీకేజీలు ‘పేట’లో ఆటా లేదు.. ఆహ్లాదమూ లేదు.. ఇల్లెందులో అసంపూర్తిగా అభివృద్ధి పనులు అన్నిచోట్లా డంపింగ్ యార్డుల సమస్య, రోడ్లపైనే చెత్త
వన్యప్రాణి సంరక్షణపై దృష్టి
గొత్తికోయలతో వన్యప్రాణులకు ముప్పు ఉందని భావిస్తున్న అటవీ అధికారులు.. వారిని అడవుల నుంచి ఖాళీ చేయిస్తున్నారు.
శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. అయితే పాలకులకు అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పట్టణాల్లో పైప్‌లైన్ల లీకేజీలతో తాగునీటి సమస్య నెలకొంది. డ్రెయినేజీలు అంతంతగానే ఉన్నాయి. ఇక డంపింగ్ యార్డులు అన్ని చోట్లా ప్రధాన సమస్యగా మారింది. పట్టణాల్లో సేకరిస్తున్న చెత్త వేసేందుకు డంపింగ్ యార్డుల్లో స్థలం లేక అనేక చోట్ల రోడ్లపైనే దర్శనమిస్తోంది. దీంతో వీధులన్నీ అపరిశుభ్రంగా మారుతుండగా ప్రజలు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ నూతన పాలకులకు సమస్యలు సవాల్ విసురుతున్నాయి.
–కొత్తగూడెంఅర్బన్/అశ్వారావుపేట/ఇల్లెందు
ఇఫ్తార్
(శుక్రవారం సాశ్రీశ్రీ)
6.18
సహర్
(శనివారం ఉశ్రీశ్రీ)
5.12
ఇల్లెందు మున్సిపాలిటీలో ఏడాది కాలంగా పాలకవర్గం లేక అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పట్టణంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ. 15 కోట్లు ఉండగా, 24 వార్డుల పరిధిలో 56 పనులు చేయాల్సి ఉంది. వీటికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలోనే శంకుస్థాపన చేసినా వివిధ కారణాలతో ముందుకు సాగడం లేదు. ఇక చెరువు కట్ట వద్దనున్న లేక్ వ్యూ పార్క్, ఆర్‌అండ్‌ఆర్ కాలనీ(కొత్తకాలనీ)లో చిల్డ్రన్ పార్క్‌ల్లో పిచ్చి మొక్కలు పెరిగి కళావిహీనంగా మారాయి. లేక్‌వ్యూ పార్క్‌లో రూ. కోటితో ఈత కొలను నిర్మించినా నిర్వహణ సక్రమంగా లేక మూతపడింది. సత్యనారాయణపురం రహదారిలో అలుగు వాగుపై హైలెవల్ బ్రిడ్డి నిర్మించాల్సి ఉంది. ఇల్లెందులపాడులో అలుగు వాగు మీదుగా వైకుంఠధామానికి వెళ్లేందుకు లోలెవల్ కాజ్‌వే కూలిపోయింది. దీని స్థానంలో మరో బ్రిడ్జి నిర్మాణానికి రూ.35 లక్షలు నిధులు కేటాయించినా పనులు సాగలేదు. ఇక పట్టణంలోని పలు ఇళ్లకు మిషన్ భగీరథ నీరు రావడం లేదు. పలు వార్డుల్లో ట్యాప్‌లు, లైన్లు లేవు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రోజువిడిచి రోజు నీటి సరఫరా చేస్తుండగా, ఎండలు ఎక్కువైతే పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెత్త సేకరణ వాహనాలు సగానికి పైగా మూలనపడ్డాయి. ఈ సమస్యలన్నీ నూతన పాలకవర్గానికి స్వాగతం పలుకుతున్నాయి.
కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోన ఏడు పంచాయతీలను కలిపి గతేడాది జూన్‌లో కొత్తగూడెం కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ఎనిమిది నెలలైనా ఇంతవరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదు. రోడ్లు, డ్రెయినేజీలు అధ్వానంగా ఉన్నాయి. డంపింగ్ యార్డులు నిండిపోయి, చెత్తంతా రోడ్లపైనే చేరుతోంది. పాతకొత్తగూడెం ఏరియాలో శ్మశానవాటికకు ఈ మార్గం నుంచే వెళ్లాల్సి వస్తుండగా, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నగర వాసులు ఆహ్లాదం కోసం వెళ్లాలంటే సరైన పార్కులు కూడా లేవు. పాల్వంచలో దశాబ్దాల క్రితం వేసిన పైప్‌లైన్లు తరచూ లీకవుతున్నాయి. దీంతో తాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కేఎస్‌పీ, శాస్త్రి రోడ్లలో డ్రెయినేజీలు నిండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. సుజాతనగర్‌లో అసలు డ్రెయిన్లే లేక వర్షం వస్తే నీరంతా రోడ్లపైనే నిలుస్తుంది. అంతర్గత రోడ్లు సైతం విశాలంగా లేక ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. ఎదుళ్ల వాగుపై వంతెన లేక అటుగా వెళ్లే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో విలీన గ్రామాల్లో సుమారు 5వేల మంది కూలీలు ఉపాధి పనులు కోల్పోయారు. వీరికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలిన అవసరం ఉంది. ఇక ప్రధానంగా కొత్తగూడెం కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయినా.. గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్‌నే కొనసాగిస్తున్నారు. ఇక్కడ తక్షణమే ఐఏఎస్ అధికారిని నియమించేలా నూతన పాలకవర్గం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.
కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఎన్నో సమస్యలు
సవాళ్ల స్వాగతం!
సవాళ్ల స్వాగతం!
సవాళ్ల స్వాగతం!
సవాళ్ల స్వాగతం!
సవాళ్ల స్వాగతం!
సవాళ్ల స్వాగతం!


