కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి నిత్యాన్నదానానికి కొత్తగూడేనికి చెందిన ఎం.సుబ్రహ్మణ్యం – నాగ కుసుమాంబ దంపతులు గురువారం రూ. లక్ష విరాళం అందజేశారు. ఈ మేరకు ఆలయ అధికారులకు చెక్కు అందించగా వారు దాతలకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన, హారతి, మంత్రపుష్పం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, అర్చకులు, వేద పండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల
ప్రచార రథం ప్రారంభం
పాల్వంచ: పట్టణంలోని శ్రీనివాసగిరిపై మార్చి 15న జరిగే కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం నుంచి గురువారం ప్రచార రథం బయలుదేరింది. ఈ సందర్భంగా సేవా ట్రస్ట్ చైర్మన్ కొత్తా వెంకటేశ్వర్లు, అధ్యక్షులు డాక్టర్ బిక్కసాని సుధాకర్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కల్యాణ మహోత్సవ ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కోశాధికారి గోవింద రెడ్డి, ఆరుట్ల లక్ష్మణాచార్యులు, గొర్రెపాటి రమేష్, జమ్ముల సీతారామి రెడ్డి, రమేష్, భక్త సమాజ మండలి అధ్యక్షులు ఊకే భద్రయ్య, శ్రీలత, నరసింహాకుమార్, పసుమర్తి వెంకటేశ్వర్లు, ఆలయ అర్చకులు నగేష్ శర్మ, ఆరుట్ల ఫణిరాజా చార్యులు పాల్గొన్నారు.
కాయకల్ప బృందం పరిశీలన
ఇల్లెందు: ఇల్లెందు ప్రభుత్వ 100 పడకల ఆస్పత్రిని జిల్లా కాయకల్ప బృందం గురువారం పరిశీలించింది. డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలోని బృందం సభ్యులు ఆస్పత్రిలో పేషెంట్లకు అందుతున్న సదుపాయాలు, చికిత్స తీరుపై ఆరా తీశారు. పలు విభాగాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ బృందానికి ఆర్‌ఎం డాక్టర్ రాంనివాస్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఫర్జానా తదితరులు సహకరించారు.
కమనీయం.. రామయ్య కల్యాణం


