వాతావరణ ం | - | Sakshi
Sakshi News home page

వాతావరణ ం

Feb 20 2026 6:50 AM | Updated on Feb 20 2026 6:50 AM

వాతావ

వాతావరణ ం

కొత్త మున్సిపాలిటీలో సమస్యలెన్నో..

గరిష్టం / కనిష్టం

350 / 190

జిల్లాలో శుక్రవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. తెల్లవారుజామున, రాత్రి వేళల్లోనూ చలి ప్రభావం కొంతమేర తగ్గుతుంది.

కొత్తగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పట్టణ వాసులు సరదాగా బయటకు వెళ్లాలంటే సరైన పార్కులు లేవు. దీంతో చిన్నారులకు ఆటా, పాట కరవవుతున్నాయి. ఇక ప్రతీ వార్డులోనూ డ్రెయినేజీ సమస్య వేధిస్తోంది. ఒకటో వార్డులోని వడ్డెరబజారు వానొస్తే ముంపునకు గురవుతోంది. రెండో వార్డులో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. 3, 4, 5 వార్డుల్లో అంతర్గత రహదారులు, తాగునీటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఆరో వార్డులో కోనేరు చెరువు మురుగు నీటి చెరువుగా మారింది. ఏడో వార్డులో వీధి దీపాలు లేక అంధకారం నెలకొంది. 8వ వార్డులోని మెరుపు కాలనీ, అటెండర్స్‌ కాలనీ, కోత మిషన్‌ బజారుల్లో పారిశుద్ధ్య సమస్య ప్రజలను వెంటాడుతోంది. ఇక్కడ పల్లె ప్రకృతి వనం సైతం నిరుపయోగంగా ఉంది. తొమ్మిదో వార్డులో పలువురికి పక్కా ఇళ్లు లేక గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. పదో వార్డులో పలువురి నివాస స్థలాలకు పట్టాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. 11వ వార్డు మోడల్‌కాలనీ, ఫైర్‌ కాలనీలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారికి మున్సిపాలిటీలో ఇంటి పన్ను ఆన్‌లైన్‌ చేయడానికి చిక్కులుండగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మిగిలిన అన్ని చోట్లా రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. నూతన పాలకవర్గ సభ్యులు వీటిపై దృష్టి సారించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

వాతావరణ ం
1
1/1

వాతావరణ ం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement