మంచి కోర్సులతోనే ఉజ్వల భవిష్యత్
పాల్వంచరూరల్ : డేటా సైన్స్, ఏఐ వంటి మంచి కోర్సులను ఎంచుకుని శిక్షణ పొందితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వరంగల్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గణిత శాస్త్ర ప్రొఫెసర్ జె.వి.రమణమూర్తి అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘సాంకేతిక రంగాల కోసం అన్వయ గణితం, గణనాత్మక పద్ధతుల్లో తాజా ధోరణులు’ అనే అంశంపై గురువారం సదస్సు నిర్వహించగా రమణమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డీగ్రీలో నూతనంగా ప్రవేశపెట్టిన ఏఐ, డేటాసైన్స్, మిషన్ లెర్నింగ్ వంటి కోర్సులను ఎంచుకోవాలని సూచించారు. డిగ్రీ తర్వాత జామ్ ఎంట్రెన్స్ రాస్తే అర్హత సాధించిన వారికి సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేసే అవకాశం లభిస్తుందని వివరించారు. ప్రిన్సిపాల్ పి.పద్మ అధ్యక్షతన జరిగిన సదస్సులో పి.శ్రీనివాసరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ నర్సింహకుమార్, ప్రొఫెసర్ ఎ.వెంకటేశ్వర్లు, డాక్టర్ అరుణకుమారి పాల్గొన్నారు.
నిట్ ప్రొఫెసర్ జె.వి.రమణమూర్తి


