కూరగాయల సాగుకు రూ.9,600 సబ్సిడీ | - | Sakshi
Sakshi News home page

కూరగాయల సాగుకు రూ.9,600 సబ్సిడీ

Feb 19 2026 9:46 AM | Updated on Feb 19 2026 9:46 AM

కూరగాయల సాగుకు రూ.9,600 సబ్సిడీ

కూరగాయల సాగుకు రూ.9,600 సబ్సిడీ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా కూరగాయలు పండించే రైతులకు ఎకరానికి రూ.9,600 సబ్సిడీని ప్రకటించింది. విత్తనాలు, నాటే మొక్కలు, సాగు ఖర్చులకు ఈ సబ్సిడీ రైతాంగానికి ఉపయోగపడుతుంది. కాగా, అర్హులైన రైతులు ఉద్యాన శాఖ ఇస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖా అధికారి జంగా కిశోర్‌ కోరారు. సబ్సిడీ కోసం సపీపంలోని ఉద్యాన అధికారి లేదా మండల స్థాయి ఉద్యాన అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement