రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Feb 19 2026 9:46 AM | Updated on Feb 19 2026 9:46 AM

రాష్ట

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

దమ్మపేట: సీఎం కప్‌ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు పి.అభిలాష్‌, ఎం.మనోజ్‌కుమార్‌ జిల్లాస్థాయిలో జరిగిన ఖో–ఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించి, ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నల్లగొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని ప్రిన్సిపాల్‌ పూనెం వీరస్వామి బుధవారం వెల్లడించారు. శిక్షణ ఇచ్చిన పీఈటీలు పద్దం ప్రసాద్‌, బుచ్చయ్యను ప్రత్యేకంగా అభినందించారు.

క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (టీఆర్‌ఈఎస్‌ఏ) నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలను కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఈఎస్‌ఏ రాష్ట్ర సెక్రటరీ కృష్ణ ప్రసాద్‌, జిల్లా కార్యదర్శి డి.పుల్లయ్య, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రసాద్‌, ట్రెజరర్‌ రంగప్రసాద్‌, టీజీఓస్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి మహేష్‌, జిల్లా నాయకులు అనంత రామకృష్ణ, శంకర్‌, అంజద్‌ పాషా, ప్రభాకర్‌, శిరీష, స్వర్ణ, రామకృష్ణ, రామ్‌నరేష్‌, మణిధర్‌, కట్టా రామకృష్ణ, వీరభద్రం, డీవీ, హుస్సేన్‌, ఆదినారాయణ, శివ, హుస్సేన్‌, రషీద్‌, హచ్యా పాల్గొన్నారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో

రెండు రోజుల జైలు

టేకులపల్లి: మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో మండలంలోని లచ్చతండా గ్రామానికి చెందిన భూక్య బాలాజీకి ఇల్లెందు కోర్టు జడ్జి రెండు రోజలు సాధారణ జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారు. ఎస్‌ఐ రాజేందర్‌ కథనం ప్రకారం.. మద్యం సేవించి వాహనం నడుపుతున్న దాస్‌తండా పంచాయతీ లచ్చతండా గ్రామానికి చెందిన భూక్య బాలాజీని బ్రీత్‌ అనలైజర్‌తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నాడని తేలింది. అతడిని ఇల్లెందు స్పెషల్‌ జ్యుడీషియల్‌ కోర్టులో హాజరు పరచగా.. పైవిధంగా తీర్పు వెలువరించారు.

రాష్ట్రస్థాయి  పోటీలకు ఎంపిక1
1/1

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement