మార్చి 4 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో స్టాఫ్ అసిస్టెంట్లుగా ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను మార్చి 4, 5, 6 తేదీల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గార్ల, ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో డీసీసీబీ విస్తరించి ఉండగా 50బ్రాంచీల ద్వారా సేవలను విస్తృతం చేసేందుకు 99 స్టాఫ్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి బ్యాంకు పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఐబీపీఎస్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలక్షన్) సంస్థ ద్వారా ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. పీఏసీ ఎస్‌ల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఇన్ సర్వీస్ కింద 25శాతం అవకాశం కల్పించారు. మార్చి మొద టి వారంలో సర్టిఫికెట్లు పరిశీలించి ఏప్రిల్ మొదటి వారంలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు వెల్లడించారు.


