ఆయుష్ కేంద్రంలో తనిఖీ
చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ ఆయుష్ ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి తుకారాం రాథోడ్ తనిఖీ చేశారు. హెల్త్, వెల్‌నెస్‌తోపాటు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ను మరింత బలోపేతం చేయాలని, గర్భిణుల ఏఎన్‌సీ నమోదు శాతం పెంచాలని సిబ్బందికి సూచించారు. పాఠశాలలలో ఆరోగ్య విద్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని, పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల గుర్తింపుతోపాటు స్క్రీనింగ్ చేపట్టాలని అన్నారు.


