వినియోగదారులకు నాణ్యమైన సేవలు
ఎన్‌పీడీసీఎల్ సీజీఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్
వేణుగోపాలాచారి
పాల్వంచ: విద్యుత్ వినియోగదారుల అవసరాలు గుర్తించి, అవసరమైన సేవలందిస్తామని ఎన్‌పీడీసీఎల్ సీజీఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్ ఎన్.వి.వేణుగోపాలా చారి అన్నారు. పాల్వంచలోని సబ్ డివిజన్ కార్యాలయంలో పాల్వంచ, ములకలపల్లి మండల విద్యుత్ వినియోగదారుల పరిష్కార కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగాపురంలో ఇళ్ల ఎదుట ఉన్న స్తంభాలను పక్కకు జరపాలని, పాండురంగాపురం, సూరారంలో ట్రాన్స్‌ఫార్మర్ల కెపాసిటీ పెంచాలని తదితర 22 సమస్యలపై వినియోగదారులు వినతిపత్రాలు అందించారు. అనంతరం వేణుగోపాలాచారి మాట్లాడుతూ విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పడు పరిష్కరించేందుకు తమ సిబ్బంది పనిచేస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు కె.రమేష్, ఎన్.దేవేందర్, ఎం.రామారావు, నందయ్య, రెహమూల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


