సేంద్రియ రైతు లక్ష్మీరెడ్డికి కలెక్టర్ అభినందన
బూర్గంపాడు: సేంద్రియ పద్ధతుల్లో మూడేళ్లుగా మిర్చి సాగు చేసి, నాణ్యమైన దిగుబడి సాధిస్తున్న లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆదర్శరైతు యారం లక్ష్మీరెడ్డిని మంగళవారం కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అభినందించారు. నాణ్యమైన ఆహార ఉత్పత్తుల కోసం రైతులు వ్యవసాయంలో సేంద్రియ పద్ధతులు ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు. లక్ష్మీరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
పుస్తక పఠనంతో విజ్ఞానం
టేకులపల్లి: పుస్తకపఠనంతో విజ్ఞానం సంపాదించుకోవచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. మంగళవారం టేకులపల్లి లైబ్రేరియన్ ఆర్.నాగన్న ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, యువతీయువకులతో కలిసి ఏర్పాటు చేసిన పుస్తక ప్రియుల పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి గ్రంథాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం చేయాలని, గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నినదించారు. ఈ సందర్భంగా పుస్తక ప్రియులు, కవి, సామాజిక వేత్త, గ్రంథాలయంతో 50 ఏళ్ల అనుబంధం ఉన్న చాగంటి కృష్ణమూర్తి, వీరబాబు, ఆర్.నాగన్నను సన్మానించారు. కార్యక్రమంలో రత్తయ్య, ఉప్పు దీప్తి, బొడ్డుపల్లి బ్రహ్మచారి, మోహన్, బసవమ్మ, బాబూరావు, శంకర్, ప్రభు, నోముల భానుచందర్, కిరణ్, మూడ్ గణేశ్, అనూష తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి సీఎం కప్‌నకు భద్రాద్రి విద్యార్థులు
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు జి.రాము, జి.లక్ష్మణ్ రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 10న జరిగిన జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో వీరిద్దరూ (సోదరులు) ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నెల 19 నుంచి హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులు, పీడీ ఎం.రమేశ్‌ను హెచ్‌ఎం జి.పద్మజ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
భూమి ఆక్రమించుకున్నారని
ఆవేదన
కారేపల్లి: జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్లకు ప్రభుత్వం పునరావాసం కింద కేటాయించిన వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించుకోవడమే కాక రికార్డుల్లో పేర్లు మార్పించుకున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కారేపల్లిలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ నాయకులతో కలిసి గలిగ పాపమ్మ తదితరులు మంగళవారం మాట్లాడారు. 2003లో లొంగిపోయిన పాపమ్మకు కమలాపురం సర్వే నంబర్ 147లో 4–37ఎకరాల భూమి కేటాయించగా, అప్పటి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి పట్టా అందజేశారు. ఈ భూమిని గిరిజనేతరులు ఆక్రమించుకోగా పోలీసులపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందన్నారు. అయినా ఆగకుండా ఓ గిరిజన రైతు ద్వారా దాడులకు దిగుతున్నారని, మరికొందరి భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులో పేర్లు మార్పించారని వాపోయారు. ఈమేరకు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని పాపమ్మ తదితరులు కోరారు. ఈ సమావేశంలో నాయకులు అలెం కృష్ణ, కల్తి రాంప్రసాద్, ఈసం భాస్కర్, గలిగ జయమ్మ పాల్గొన్నారు.
రేపు జాబ్‌మేళా
ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 19వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. పేటీఎం సేల్స్ అండ్ సర్వీసెస్‌లో వంద ఉద్యోగాల భర్తీకి టేకులపల్లిలోని మోడల్ కేరీర్ సెంటర్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. అర్హతలు, ఇతర వివరాల కోసం 98667 71213 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
సేంద్రియ రైతు లక్ష్మీరెడ్డికి కలెక్టర్ అభినందన
సేంద్రియ రైతు లక్ష్మీరెడ్డికి కలెక్టర్ అభినందన


