రామయ్యకు ముత్తంగి అలంకరణ | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు ముత్తంగి అలంకరణ

Feb 17 2026 7:44 AM | Updated on Feb 17 2026 7:44 AM

రామయ్

రామయ్యకు ముత్తంగి అలంకరణ

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వా త స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

గ్రామ పాలనలో

వార్డు సభ్యులే కీలకం

బూర్గంపాడు: గ్రామపంచాయతీల పాలనలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు కూడా కీలకమని పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ విద్యాలత అన్నారు. బూర్గంపాడులోని రైతువేదికలో సోమవారం నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గ్రామపంచాయతీలో అభివృద్ధి పనుల కేటాయింపునకు వార్డు సభ్యుల తీర్మానాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. పాలకవర్గ సమావేశాలకు, గ్రామసభలకు వార్డు సభ్యులు వెళ్లి సమస్యలను తెలియజేసి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో అమలుచేయాలన్నారు. అనంతరం శిక్షణ పొందిన వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుధీర్‌కుమార్‌, డిప్యూటీ సీఈఓ చంద్రశేఖర్‌, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ బాలయ్య పాల్గొన్నారు.

3,017.16 మెట్రిక్‌ టన్నుల యూరియా

చింతకాని: జిల్లాలోని చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్‌ పాయింట్‌కు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కంపెనీకి చెందిన 3,017.16 మెట్రిక్‌ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఈ యూరియాలో ఖమ్మం జిల్లాకు 1,917.16 మెట్రిక్‌ టన్నులు, భద్రాద్రి కొ త్తగూడెం జిల్లాకు 300 మె.టన్నులు కేటాయించినట్లుఏఓ(టెక్నికల్‌)పవన్‌కుమార్‌తెలిపారు. అలా గే, మహబూబాబాద్‌ జిల్లాకు 600 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేయగా, మిగతా 200 మెట్రిక్‌ టన్నులను బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేసినట్లు వెల్లడించారు.

రామయ్యకు  ముత్తంగి అలంకరణ1
1/1

రామయ్యకు ముత్తంగి అలంకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement