ఖేలో ఇండియా పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఖేలో ఇండియా పోటీలకు ఎంపిక

Feb 17 2026 7:44 AM | Updated on Feb 17 2026 7:44 AM

ఖేలో

ఖేలో ఇండియా పోటీలకు ఎంపిక

గుండాల: ఈ నెల 23 రాజస్థాన్‌లో జరిగే ఖేలో ఇండియా ట్రైబల్‌ మీట్‌ ఫుట్‌బాల్‌ క్రీడలకు గుండాల మండలానికి చెందిన నలుగురు యువకులు ఎంపికయ్యారు. ఈ నెల 7,8 తేదీల్లో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన ఫుట్‌బాల్‌ క్రీడలో కొమ్ముగూడెం గ్రామానికి చెందిన వాగబోయిన వంశీ, సాయినపల్లి గ్రామానికి చెందిన తాటి మోహన్‌, పోలేబోయిన హర్షిత్‌, చింతలపాడు గ్రామానికి చెందిన ఊకె శ్రావణ్‌ కుమార్‌ ప్రతిభ కనబర్చారు. ఐదు రోజులపాటు నిర్వహించే పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ఆడనున్నారు.

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ

ఇల్లెందు: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి గత నెలలో నిర్వహించిన జేఈఈ (మెయిన్‌) పేపర్‌–1 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాల్లో ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెం గ్రామానికి చెందిన రవి – విజేతల కుమార్తె గంగాధరణి శ్రీజ ఉత్తమ పర్సంటైల్‌ సాధించింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలోని టీజీఆర్‌జేసీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న ఆమె అక్కడే జేఈఈ మెయిన్స్‌కు సిద్ధమవుతోంది. ఈ మేరకు పేపర్‌–1లో 82.65 శాతం పర్సంటైల్‌ సాధించిన శ్రీజను పలువురు అభినందించారు. కాగా, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఆమె 470కి 465 మార్కులతో రాష్ట్ర స్థాయి 4 ర్యాంకు సాధించింది.

ఖేలో ఇండియా పోటీలకు ఎంపిక1
1/1

ఖేలో ఇండియా పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement