‘నోటిఫైడ్’ టు కార్పొరేషన్
1988 సంవత్సరంలో
నోటిఫైడ్ ఏరియాకు కమిటీ
1995లో మున్సిపాలిటీగా,
ఇప్పుడు కార్పొరేషన్‌గా..
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం నోటిఫైడ్ ఏరియా నుంచి మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. కానీ చెప్పుకోదగిన అభివృద్ధి మాత్రం జరగలేదు. ప్రజలకు సదుపాయాలు, సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నాలుగుసార్లు మున్సిపల్ ఎన్నికలు జరిగి, పాలకవర్గాలు కొలువుదీరినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదు. కౌన్సిలర్లే కాంట్రాక్టర్లుగా మారి, పనులు నాణ్యత లేకుండా చేపట్టడంతోపాటు అవినీతి, అక్రమాలతో పాలన సాగిందనే ఆరోపణలు వచ్చాయి.
1971లో ఏర్పాటు
కొత్తగూడేన్ని 1971లో నోటిఫైడ్ ఏరియాగా గుర్తించారు. 1988లో నోటిఫైడ్ ఏరియా కమిటీ నియమించారు. అందులో చైర్మన్, కమిటీ సభ్యులు ఉండే వారు. కమిటీ నిర్ణయాల మేరకు అధికారులు అభివృద్ధి పనులు నిర్వహించేవారు. 1995లో మొదటి గ్రేడ్ మున్సిపాలిటీగా మారింది. 2000లో 25 వార్డులకు తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో గరీబ్‌పేట పంచాయతీలో ఉన్న చిట్టి రామవరాన్ని మున్సిపాలిటీలో విలీనం చేశారు. 2005లో రెండోసారి ఎన్నికలు జరిగాయి. మూడోసారి 2014 సంవత్సరంలో పెరిగిన ఓట్లకు అనుగుణంగా వార్డుల సంఖ్యను 33కు పెంచి ఎన్నికలు నిర్వహించారు. అనంతరం నాలుగోసారి 2020 సంవత్సరంలో 36 వార్డులకు ఎన్నికలు జరిగాయి.
పాల్వంచ, సుజాతనగర్‌ను కలిపి..
గతేడాది కొత్తగూడెం మున్సిపాలిటీలో పాల్వంచ మున్సిపాలిటీతోపాటు సుజాతనగర్‌ను విలీనం చేస్తూ కార్పొరేషన్‌గా ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కార్పొరేషన్‌కు తొలి ఎన్నికలు జరుగుతున్నాయి. కార్పొరేషన్‌లో విలీనమైన పాల్వంచలో కూడా మూడు దశాబ్దాల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో సందడి నెలకొంది.
మారుతూ వచ్చిన
కొత్తగూడెం స్వరూపం
‘నోటిఫైడ్’ టు కార్పొరేషన్


