కొలువుదీరిన అమ్మలు
ఇల్లెందురూరల్: వన దేవతలైన సమ్మక్క, సారలమ్మ ఇరువురు గద్దెల మీద దర్శనమివ్వడంతో శుక్రవారం జాతర పరిపూర్ణత సంతరించుకుంది. బొజ్జాయిగూడెం గ్రామ మహిళలు బోనాలతో ప్రదర్శనగా తరలివచ్చి అమ్మవార్లకు సమర్పించారు. ఎస్పీ రోహిత్‌రాజ్ పోలీస్ అధికారులు, సిబ్బందితో సహా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. వనదేవతల దర్శనం కోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పోటెత్తారు. డీఎస్పీ వెంకన్నబాబు, సీఐ సురేశ్ బందోబస్తు నిర్వహించారు.
మణుగూరులో..
మణుగూరుటౌన్: మేడారం జాతరకు అనుసంధానంగా మండలంలోని తోగ్గూడెంలో మినీమేడారం జాతర నిర్వహించడం ఆనవాయితీ. కాగా, గద్దెలకు చేరిన అమ్మవార్లను శుక్రవారం భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. సీఐ నాగబాబు, ఎస్‌ఐ నగేశ్ బందోబస్తు చేపట్టగా.. ఇన్‌చార్జ్ మెజి స్ట్రేట్ శివనాయక్ అమ్మవార్లను దర్శించుకున్నారు. శనివారం అమ్మవార్లు వనప్రవేశం చేయనున్నారు.
కొలువుదీరిన అమ్మలు
కొలువుదీరిన అమ్మలు
కొలువుదీరిన అమ్మలు


