శ్మశానవాటికగా మారిన పల్లెప్రకృతి వనం..
బూర్గంపాడు: పల్లె ప్రకృతి వనం శ్మశానవాటికగా మారింది. మండలంలోని తాళ్లగొమ్మూరు పల్లె ప్రకృతి వనంలో ఒకరి అంత్యక్రియలు నిర్వహించటమే కాకుండా సమాధి నిర్మాణం కూడా చేపట్టారు. గత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ప్రస్తుతం నిరాధారణకు గురవుతున్నాయి. తాళ్లగొమ్మూరుకు చెందిన మహిళ ఇటీవల మృతిచెండగా ఆమె కుటుంబ సభ్యులు పల్లె ప్రకృతి వనంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఏకంగా సమాధి నిర్మాణం చేపట్టారు. దీంతో కొందరు గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం స్థానిక సర్పంచ్ గుమ్మడి కృష్ణవేణి. పంచాయతీ కార్యదర్శి మురళి పల్లె ప్రకృతి వనం వద్దకు వెళ్లి సమాధి నిర్మాణాన్ని పరిశీలించారు. ఘటనకు బాధ్యులైన వారికి నోటీసులు జారీ చేశారు.
తాళ్లగొమ్మూరు పల్లె ప్రకృతి వనంలో
సమాధి నిర్మాణం


