మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ
దమ్మపేట: మండలంలోని మొద్దులగూడెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, సరస్వతి దేవి, అంబేడ్కర్ విగ్రహాలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. గాంధీ, సరస్వతి విగ్రహాలను గ్రామ పెద్ద బచ్చు సత్యనారాయణ సహకారంతో, అంబేడ్కర్ విగ్రహం పాఠశాల సిబ్బంది సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, తహసీల్దార్ రామనరేష్, ఎంఈఓ కీసర లక్ష్మి, హెచ్‌ఎం బండి శ్రీనివాసరెడ్డి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.


