గిరిజనుల అభివృద్ధికి కృషి
● ఐటీడీఏ పీఓ రాహుల్ ● కోయ భాషలో ప్రశంసాపత్రాలు
భద్రాచలం: గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ తెలిపారు. సోమవారం ఐటీడీఏ ప్రాంగణంలో జరిగిన 77వ గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండావందనం చేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాత్రంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనుల చెంతకు చేర్చుతున్నట్లు తెలిపారు. ఎందరో మహానుభావుల కృషితో రాజ్యాంగ రూపకల్పన జరిగిందన్నారు. అనంతరం ప్రగతిని నివేదిక వివరించారు. వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
కోయ భాషలో ప్రశంసాపత్రాలు
గిరిజన సంస్కృతిపై మమకారం చూపిస్తున్న ఐటీడీఏ పీఓ వివిధ శాఖల ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను కోయ భాషలో రూపొందించి, అందించారు. గతంలో ఆహ్వానాలను కోయ భాషలో ముద్రించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు డేవిడ్ రాజ్, అశోక్, మధుకర్, ఉదయ్ కుమార్, సున్నం రాంబాబు, సమ్మయ్య, లక్ష్మీనారాయణ, అరుణకుమారి, రమణయ్య, రమేష్, హరికృష్ణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల అభివృద్ధికి కృషి


