వలస ఆదివాసీ గ్రామంలో గణతంత్ర వేడుకలు
దుమ్ముగూడెం : మండలంలోని వలస ఆదివాసీ గ్రామం గద్దమడుగులో సోమవారం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా అంటే ఏమిటో తెలియని ఆదివాసీ గూడెంలో మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. అటవీశాఖ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాల( రేకుల షెడ్డు)ను ఎఫ్‌డిఓ సుజాత ప్రారంభించారు. విద్యార్థులకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసీలు వెదురు మొక్కలు, కౌజు పిట్టల పెంపకం ద్వారా ఆదాయం పొందాలన్నారు. కాగా గ్రామానికి రోడ్డు నిర్మించాలని ఆదివాసీలు ఎఫ్‌డీఓను కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో రంజిత, సర్పంచ్ కొరస దుర్గమ్మ, ఉప సర్పంచ్ రేసు కుమారి, పంచాయతీ సెక్రెటరీ నాగేంద్రబాబు, ఆదివాసి నాయకులు ముర్రాం వీరభద్రం, కొరస రామచంద్రయ్య, వెట్టి ఇరమయ్య, మడకమ్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.


