
13 మంది ఉత్తమ ఉద్యోగులు
సింగరేణి(కొత్తగూడెం): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సింగరేణి పరిధిలో 13 మంది ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేశారు. కొత్తగూడెంలో శుక్రవారం జరిగే వేడుకల్లో వీరిని సీఎండీ బలరామ్ సన్మానిస్తారని జీఎం (పర్సనల్ – వెల్ఫేర్) జి.వి.కిరణ్ తెలిపారు. ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై న వారిలో మణుగూరు ఏరియా నుంచి ఎ.ఆంజనేయులు(ఈపీ ఆపరేటర్ పీకేఓసీ–11), ఇల్లెందు ఏరియా నుంచి బి.సీతారాములు(ఫిట్టర్–కేఓసీ), కొత్తగూడెం ఏరియా నుంచి బి,కుమారకృష్ణ(పీవీకే–5 ఇంకై ్ల న్) ఉన్నారు. వీరితో పాటు ఇతర ఏరియాలకు చెందిన మరో 10 మంది ఉన్నారు.
ఉత్తమ తహసీల్దార్‌గా ఎంపిక
టేకులపల్లి: టేకులపల్లి తహసీల్దార్ లంకపల్లి వీరభద్రం జిల్లాలో ఉత్తమ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. గత నెల 1న విధుల్లో చేరిన ఆయన.. అనతికాలంలోనే భూ భార తి దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రి య వేగవంతం చేయడం, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం, రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతం తదితర పనులు చేసినందున ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. శుక్రవారం కొత్తగూడెంలో జరిగే వేడుకల్లో ఆయన అవార్డు అందుకోనున్నారు.
ఫైర్‌మెన్‌కు జాతీయ అవార్డు
భద్రాచలం: భద్రాచలానికి చెందిన లీడింగ్ ఫైర్‌మెన్ మహ్మద్ సాధిక్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన జాబితాలో సాధిక్ పేరు ప్రకటించారు. గోదావరి వరదలు, ఏజెన్సీలో అగ్ని ప్రమాదాల సమయంలో కీలకంగా విధులు నిర్వహించడంతో ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకం, ఉత్తమ ఉద్యోగిగా కలెక్టర్ చేతులు మీదుగా పలుమార్లు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా సాధిక్‌ను జిల్లా ఫైర్ అధికారి ఎం.క్రాంతి, భధ్రాచలం స్టేషన్ అఽధికారి శ్రీనివాస్ అభినందించారు.
గవర్నర్‌తో తేనీటి
విందుకు ఆహ్వానం
సింగరేణి(కొత్తగూడెం): పర్యావరణ పరిరక్షణకు రోజుకొక మొక్క నాటుతున్న సింగరేణి కార్మికుడు కె.ఎన్. రాజశేఖర్‌కు నేడు రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చే తేనీటి విందులో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ఈ సందర్బంగా సెంట్రల్ వర్క్‌షాపు జీఎం దామోదర్, డీఈ రాజీవ్‌కుమార్, నాయకులు కనకరాజు, గౌస్, శంకర్, రామకృష్ణ, వెంటపుల్ల య్య, సుప్రియ తదితరులు అభినందించారు.