
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో శుక్రవారం జరిగే స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉదయం 9.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సందేశం ఇస్తారని తెలిపారు. అనంతరం మార్చ్‌ఫాస్ట్, స్వాతంత్య్ర సమరయోధుల సన్మానం, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. డీఆర్‌డీఏ, వ్యవసాయ, సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖలు ఏర్పాటు చేసే స్టాళ్లు ఆకర్షణీయంగా ఉండాలని అధికారులకు సూచించారు. వర్షం వచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపిక చేసిన ఉద్యోగులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు, తహసీల్దార్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ముస్తాబైన ప్రకాశం స్టేడియం..
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం ముస్తాబైంది. సీఎండీ ఎన్.బలరామ్ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమ నిర్వహణ కన్వీనర్ జి.వి. కిరణ్‌కుమార్ వారం క్రితమే సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రగతి మైదానాన్ని పరిశీలించిన కలెక్టర్