
కేబిన్‌తో మార్కెట్ చెక్ పోస్టులు
ఇల్లెందు: ఇల్లెందు వ్యవసాయ మార్కెట్‌కు చెక్ పోస్టులు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. 2023–24లో ఇల్లెందు మార్కెట్ ఆదాయం రూ.3.24 కోట్లు కాగా, చెక్ పోస్టుల ద్వారా రూ 0.91 లక్షలు చేకూరింది. 2024–25 సంవత్సరంలో రూ.5.14 కోట్ల ఆదాయం రాగా చెక్ పోస్టుల నుంచి రూ.1.08 కోట్ల ఆదాయం వచ్చింది. మార్కెట్‌కు పట్టణంలోని సుభాష్‌నగర్ కూడలి, బొమ్మనపల్లి, ముచ్చర్ల, బయ్యారంలో చెక్ పోస్టులు ఉన్నాయి. వీటిలో సుభాష్‌నగర్, బొమ్మనపల్లి, బయ్యారం చెక్ పోస్టులు తాత్కాలిక రేకుల షెడ్డులో కొనసాగుతున్నాయి. చలి, ఎండ, వానల నుంచి రక్షణలేక సిబ్బంది అవస్థ పడుతున్నారు. ఈ క్రమంలో చెక్‌పోస్టులను పటిష్టపరిచేందుకు మార్కెట్ కమిటీ చర్యలు చేపట్టింది. మూడింటిని త్వరలో కేబిన్ చెక్ పోస్టులుగా మార్చనుంది. ఒక్కో కేబిన్‌కు రూ.లక్ష ఖర్చు చేస్తున్నారు. నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. నిర్మాణం పూర్తయ్యాక చెక్ పోస్టు ప్రదేశానికి తరలించి పునాది నిర్మించి, దానిపై కేబిన్ ఏర్పాటు చేయనున్నారు. కేబిన్‌లో బెడ్, టేబుల్, కుర్చీ, ఫ్యాన్, కూలర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పటిష్ట రక్షణ చర్యలతో..
మార్కెటింగ్ చెక్ పోస్టుల్లో సిబ్బంది రాత్రి, పగలు విధులు నిర్వర్తిస్తున్నారు. వారి రక్షణకు, దస్త్రాల భద్రతకు పటిష్టమైన రక్షణ కల్పించేలా కేబిన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఎండ, వాన, చలికి భయపడాల్సిన అవసరం లేదు. ఫైళ్లు, నగదు భద్రపర్చుకోవచ్చు. జిల్లాలో తొలిసారిగా ఇల్లెందు మార్కెట్ పరిధిలోనే కేబిన్‌లు ఏర్పాటు చేస్తున్నాం.
– ఈ.నరేష్, సెకండ్ గ్రేడ్ సెక్రటరీ,
మార్కెట్ యార్డు, ఇల్లెందు
రూ. 3 లక్షలతో మూడు చోట్ల ఏర్పాటుకు ఇల్లెందు మార్కెట్ కమిటీ చర్యలు

కేబిన్‌తో మార్కెట్ చెక్ పోస్టులు