
● చెట్టు కాదు.. పైపే !
ఆకుల తీగ అల్లుకుని ఇలా ఎత్తుగా కనిపిస్తోంది చెట్టు అనుకుంటే పొరపాటే. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన ఎయిర్ వాల్వ్ పైప్ ఇది. 2008లో కిన్నెరసాని రిజర్వాయర్ ఎండిపోగా, కేటీపీఎస్‌కు గోదావరి జలాలను సరఫరా చేసేందుకు నాటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి రూ.100 కోట్లు కేటాయించారు. దీంతో బూర్గంపాడు మండల పరిధిలోని గోదావరి నుంచి కేటీపీఎస్ వరకు భారీ పైప్‌లైన్ వేశారు. అక్కడక్కడా ఇలా ఎయిర్ వాల్వ్‌లు ఏర్పాటు చేయగా.. పాల్వంచలో వేసిన పైప్‌కు ఇలా తీగ అల్లుకోవడంతో చెట్టును తలపిస్తోంది.
– పాల్వంచరూరల్