స్నేహం.. సమాజ సేవ | - | Sakshi
Sakshi News home page

స్నేహం.. సమాజ సేవ

Aug 3 2025 3:14 AM | Updated on Aug 3 2025 3:40 AM

కలిసి చదువుకునే, కలిసి పనిచేసే క్రమంలో ఎందరో పరిచయమవుతుంటారు. వారిలో కొందరు మాత్రం స్నేహితులుగా మారతారు. వారిలో ఒకరిద్దరు మాత్రమే ఆప్త మిత్రులుగా మిగిలిపోతారు. కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారు. ఆపద, అవసరాల్లో ఉన్న మిత్రులకు తోడ్పడుతుంటారు. ఇతరులకూ సాయం అందిస్తూ సామాజిక సేవ చేస్తుంటారు. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా అలాంటి కొందరు మిత్రుల గురించి తెలుసుకుందాం.
● సేవా కార్యక్రమాలు చేపడుతున్న మిత్ర బృందాలు ● అవసరార్థులకు ఆర్థికసాయం, రక్తదానం, అన్నదానం ● పలువురికి మార్గదర్శనం చేస్తూ బంగారు భవిష్యత్‌కు కృషి
నేడు ప్రపంచ స్నేహితుల దినోత్సవం

సేవా మార్గంలో..

కొత్తగూడెంటౌన్‌: ఓ మిత్రుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మరో స్నేహితుడు కరోనాతో మరణించాడు. ఒకరికి రక్తం అందక, మరొకరికి సరైన చికిత్స అందక చనిపోయారు. ఆ ఘటనతో చలించిన స్నేహితులు 2019లో ఫ్రెండ్స్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు. డిప్లొమో పూర్తిచేశాక ఎవరి వృత్తిలో వారు కొనసాగుతూ సమాజసేవ చేస్తున్నారు. తొలుత సీహెచ్‌ శ్రీకాంత్‌, శివ, చింటూ, సిద్ధు, ఉదయ్‌, సత్యసాయి, కౌశిక్‌, శ్రీను, నవాజ్‌ తదితరులు ఫౌండేషన్‌ ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 50 మంది వరకు కలిసి పనిచేస్తున్నారు. కొత్తగూడెం రైటర్‌బస్తీకి చెందిన వీరు రక్తదానం, అన్నదానం చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు ఐదు వేల మందికి రక్తదానం చేశారు. వారంలో మూడు రోజులు రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ సెంటర్‌లు, రోడ్లపై అనాథలు, వృద్ధులకు అన్నదానం చేస్తున్నారు. ఆరు నెలలకోసారి రక్తదాన శిబిరం నిర్వహిస్తూ తలసేమియా బాధితులకు రక్తం అందిస్తున్నారు. ఆరేళ్లుగా దాదాపు 800 మందికి రక్తదానం చేశారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, అనారోగ్యానికి గురైనవారికి ఆర్థికసాయం చేస్తున్నారు. నిత్యం సేవా కార్యక్రమాలతో ఈ మిత్రబృందం పలువురి అభినందనలు అందుకుంటోంది.

మిత్ర చతుష్టయం.. కాలేజీకి ఆర్థికసాయం

పాల్వంచరూరల్‌: హరి, కృష్ణమోహన్‌, శివనాగేశ్వరరావు, సోమసుందరం నలుగురు స్నేహితులు. వీరు పదో తరగతి వరకు 1981–1982 పాల్వంచలోని బొల్లోరిగూడెం హైస్కూల్లో, ఇంటర్‌ 1982–1984 వరకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుకున్నారు. వీరిలో హరి, కృష్ణమోహన్‌ ప్రస్తుతం వారు చదివిన హైస్కూల్లోనే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. శివనాగేశ్వరరావు, యూఎస్‌ఏలో, సోమసుందరం నైజీరియాలో ఉద్యోగాలు చేస్తున్నారు. చదువుకునే రోజుల్లో వీరి మధ్య ఏర్పడ స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇతర దేశాల్లో ఉన్న ఇద్దరు మిత్రులతో నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా క్షేమ సమాచారాలు పంచుకుంటున్నారు. కుటుంబాలతో సహా స్నేహంగా ఉంటున్నారు. తాము చదువుకున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇటీవల గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించగా, నలుగురూ కలిసి కాలేజి అభివృద్ధికి రూ. 50 వేలు విరాళంగా ఇచ్చారు.

స్నేహం.. సమాజ సేవ1
1/2

స్నేహం.. సమాజ సేవ

స్నేహం.. సమాజ సేవ2
2/2

స్నేహం.. సమాజ సేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement