
●స్నేహితుల ‘హెల్ప్‌లైన్’
ఇల్లెందు: ేస్నహితులైన ఆదివాసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు 35 మంది కలిసి 2013 మార్చి 9న ఇల్లెందు కేంద్రంగా హైల్ప్‌లైన్ సంస్థను ప్రారంభించారు. వీరిలో కుర్సం అంజయ్య, కబ్బాకుల రవి, కుంజ కృష్ణ, కొడెం కృష్ణ, కల్తీ రాంబాబు, కొర్సా ఆదినారాయణ, గలిగే రాంబాబు, బొర్రా రాంబాబు తదితరులు ఉన్నారు. ఇల్లెందు, పరిసర ప్రాంతాల ఆదివాసీ ప్రజలకు ఉచితంగా ఆన్‌లైన్ సేవలు అందిస్తున్నారు. ఇందుకోసం ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, ఫర్నిచర్, పరికరాలను సమకూర్చుకున్నారు. ఆపరేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆదివాసీ విద్యార్థులకు, నిరుద్యోగులకు కెరీర్‌గైడెన్స్, స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఇక కరోనా సమయంలో ఆదివాసీ గూడేల్లో నిత్యాసరాలు పంపణీ చేశారు. 2020 నుంచి అవసరార్థులకు ఆర్థికసాయం కూడా చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ కొర్సా కిరణ్‌కు రూ. 20 వేలు, బండ హర్షవర్ధన్‌కు రూ. 40 వేలు, అనారోగ్యానికి గురైన రోహన్‌కు రూ.40 వేలు, ధనసరి తపస్వినికి ఆర్థికసాయం అందించారు. గుండాల మండలం చీమలగూడెం గ్రామానికి చెందిన కల్తీ భవాని ఎంబీబీఎస్‌లో సీటు సాధించగా చదువు కోసం రూ. 25 వేలు విరాళం అందించారు. ములుగు జిల్లా మంగపేట మండలం శనిగకుంట గ్రామంలో 40 ఇళ్లు అగ్నికి ఆహుతైతే రూ. 2 లక్షలతో బియ్యం, బట్టలు అందించారు. ఇలా 35 మంది స్నేహితులు సామాజిక సేవ చేస్తూ పలువురు ఆదర్శంగా నిలుస్తున్నారు.
అండగా ఉంటున్నాం..
ఆదివాసీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి ఆన్‌లైన్ సేవలు ఉచితంగా అందిస్తున్నాం. మరోవైపు ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆర్థికంగా సాయం చేస్తున్నాం. మేము కొందరికి అండగా ఉంటున్నామనే సంతోషం మిగులుతుంది.
–కుర్సం అంజయ్య, హెల్ప్‌లైన్ వ్యవస్థాపక సభ్యుడు
●

●స్నేహితుల ‘హెల్ప్‌లైన్’